కందుకూరులో 8 మంది మరణవార్త 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో విషాదం నింపింది: బాలకృష్ణ

  • కందుకూరులో చంద్రబాబు సభ
  • భారీ తొక్కిసలాట కారణంగా 8 మంది మృత్యువాత
  • మనసు కలచివేసిందన్న బాలకృష్ణ
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
కందుకూరు ఘటనలో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం పట్ల టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కందుకూరులో 8 మంది మరణించారన్న వార్త 80 లక్షల మంది కార్యకర్తల కుటుంబాల్లో విషాదం నింపిందని పేర్కొన్నారు. కార్యకర్తల మృతి మనసును కలచివేసిందని తెలిపారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం అత్యంత బాధాకరమని బాలకృష్ణ వివరించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

Balakrishna
Kandukur
Party Workers
Death
TDP

More Telugu News